చెన్నై: తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నటుడు కమల్ హాసన్ కూడా జోరుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని ప్రముఖ సినీ రచయిత శరవణన్ అన్నారు. ‘తమిళనాడులో కమల్ తన ఉనికిని బలంగా చాటుకుంటున్నారు. నిజాయితీగా చెప్పాలంటే.. కమల్ పార్టీకి ఎలాంటి సైద్ధాంతిక పునాదులు లేవు. సినిమాలతో వచ్చిన ఛరిష్మాను చూపి ఓట్లను అడగలేరు. అలా అడిగితే తమిళ ప్రజలు ఓట్లేయరు’ అని శరవణన్ చెప్పారు. తమిళనాడులో కమల్ గెలవలేకపోయినా ఆయన పార్టీ ప్రభావం మాత్రం పక్కాగా ఉంటుందని శరవణన్ చెప్పుకొచ్చారు.
