ఒకవైపు ప్రచారం, మరొకవైపు చేరికలు... బిజీబిజీగా జగన్.. 

ఏపీలో ఎన్నికల హడావిడి ముమ్మరం అయ్యింది. అధికార ప్రతిపక్షాలు ప్రచారం కూడా మొదలుపెట్టడంతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్న జగన్ ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు పార్టీలో చేరే వారిని ఆహ్వానిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుండి చాలా మంది కీలక నేతలు వైసీపీలో చేరగా తాజాగా టీడీపీకి చెందిన మరొక కీలక నేత వైసీపీలో చేరారు.

కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కర్నూలులో పర్యటిస్తున్న జగన్ కండువా కప్పి ఉమామహేశ్వర నాయుడును పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు కల్యాణదుర్గానికి చెందిన పలువురు కీలక టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఉమామేశ్వర నాయుడుకు జగన్ హామీ ఇచ్చారు.