కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి

మెదక్, వెలుగు: అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో హావేలి ఘనపూర్​ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులైన  ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. 

కార్యక్రమంలో మున్సిపల్​చైర్మెన్​చంద్రపాల్, హావేలి ఘనపూర్​మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, పరుశురాం గౌడ్,  పద్మారావు, మంజుల, ఆదిల్ పాషా, వెంకట్ రెడ్డి, భాస్కర్, సాయిబాబా, శ్రీకాంత్, సాయిలు, అక్బర్, సతీశ్, నాగిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, హపీజ్, లింగం, శేఖర్, శంకర్, శ్రీనివాస్ చౌదరి, కృష్ణ, అరవింద్ పాల్గొన్నారు.