కాళేశ్వరం కమిషన్​ విచారణ మళ్లీ షూరు.. ఓపెన్ కోర్టు ముందుకు రిటైర్ట్ ఐఏఎస్‎లు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ మళ్లీ మొదలు కానుంది. కమిషన్​చైర్మన్ ​జస్టిస్​ పీసీ ఘోష్​ బుధవారం నుంచి మరో దఫా ఎంక్వైరీని స్టార్ట్​ చేయనున్నారు. తాజాగా చేయనున్న ఓపెన్​ కోర్టుకు రిటైర్డ్​ఐఏఎస్​అధికారులకు కమిషన్​ సమన్లు ఇచ్చింది. ఇరిగేషన్​ శాఖ మాజీ కార్యదర్శులైన రజత్​కుమార్, ఎస్కే జోషిని ఎంక్వైరీకి పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న ​ నిర్ణయాలపై ఆ ఇద్దరు అధికారుల నుంచి కమిషన్ ​వివరాలు రాబట్టనుంది. గురువారం నుంచి మిగతా ఐఏఎస్​లకూ సమన్లు పంపి విచారించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. స్మితా సబర్వాల్, రిటైర్డ్​ సీఎస్​ సోమేశ్​కుమార్, ఫైనాన్స్​ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణా రావు తదితరులను విచారణకు పిలిచేందుకు కమిషన్​ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.