బీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదు : కాయితి విజయ భాస్కర్ రెడ్డి

కల్వకుర్తి, వెలుగు: బీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదని కల్వకుర్తి బ్లాక్  కాంగ్రెస్  అధ్యక్షుడు కాయితి విజయ భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపి హయాంలో జిల్లాకు ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదన్నారు. 

జిల్లాలో వేలాది మంది యువత ఉన్నత చదువులు చదివి కూలీలుగా మారుతున్నారని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​తోనే జూరాల, భీమా, కోయిలసాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్  గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, మిరియాల శ్రీనివాస్ రెడ్డి, పుస్తకాల రాహుల్, శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బీస బాలరాజు, జంగయ్య గౌడ్, సుదర్శన్, భరత్, పాల్గొన్నారు.