హైదరాబాద్, వెలుగు: యూకేకు చెందిన డేటా అండ్ అనలిటిక్స్, ఈఆర్పీ స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ కగూల్ గచ్చిబౌలిలోని నానక్‌రాంగూడ ప్రాంతంలో ఉన్న కపిల్ టవర్స్‌లో మరో ఆఫీసును ఓపెన్ చేసింది. 200 మందికి పైగా ఉద్యోగులకు చోటు కల్పించే కొత్త 17,000 చదరపు అడుగుల ఆఫీసును కగూల్ సీఈఓ డాన్ బార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం కోసం తాము ప్రకటించిన స్ట్రాటెజిక్ గ్రోత్ప్లాన్స్ ప్రకారం హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ వారం పుణేలోనూ తమ ఆఫీసును తెరిచామని చెప్పారు. ‘‘అంతర్జాతీయ కస్టమర్లకు సపోర్ట్ ఇవ్వడానికి హైదరాబాద్ సెంటర్లో మంచి అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు సంవత్సరాలలో భారతదేశంలో అంచనా పెట్టుబడులను 8 మిలియన్ డాలర్లకు పెంచాం. మా 160 -సీట్ల పుణే కేంద్రం ఈ సంవత్సరం ఆగస్టు నుంచి డైరెక్ట్‌గా సేవలు అందిస్తుంది. 2025 నాటికి భారతదేశంలో 2000 మంది సిబ్బందితో కూడిన బలమైన కంపెనీగా ఎదుగుతాం" అని డాన్ బార్లో తెలిపారు. ట్యాలెంట్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉండటం వల్లే గ్లోబల్ డెలివరీ & రీసెర్చ్ సెంటర్ కోసం ఇండియాను ఎంచుకున్నామని కగూల్ గ్రూప్ సీఓఓ సీఐఓ ప్రశాంత్ పటేల్ అన్నారు. తమ క్లయింట్లలో 80 శాతం ఎఫ్‌టీఎస్ఈ 100 లేదా ఎస్ అండ్ పి –500లో లిస్ట్ అయ్యాయని చెప్పారు. పోయిన క్వార్టర్లో ఎన్ఐటీలు, బిట్స్, గీతమ్స్, జీఎన్ఐటీఎస్, కిట్స్ (వరంగల్) నుంచి గ్రాడ్యుయేట్స్‌ను తీసుకున్నామని కగూల్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి తెలిపారు. ఎనలిటిక్స్, ఏఐ/ఎంఎల్, ఇంటిగ్రేషన్లు, ఎస్ఏఏఎస్ యాప్ లు, ఈఆర్పీ, వెబ్ అప్లికేషన్లు, టెస్టింగ్ ఏఎంఎస్ లాంటి రంగాల్లో ప్రొడక్టులను కగూల్ అందిస్తుంది.
