నూతన కాగ్‌గా కె.సంజయ్​మూర్తి.. మన తెలుగు వ్యక్తే

ప్రస్తుత కంప్ట్రోలర్ అండ్​ ఆడిటర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా పదవీకాలం నవంబర్​ 20తో ముగియడంతో తదుపరి కాగ్​గా కె.సంజయ్​మూర్తి నియమితులయ్యారు. దీంతో కాగ్​ పదవిని చేపడుతున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్​మూర్తి నిలిచారు. ఈయన హిమాచల్​ప్రదేశ్​ 1989 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి. 2002–07 మధ్య కాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ, ఐటీ మంత్రిత్వశాఖల్లో పనిచేశారు. 2021, అక్టోబర్​ 1 నుంచి ఇప్పటివరకు కేంద్ర విద్యాశాఖలో హయ్యర్​ ఎడ్యుకేషన్​ విభాగం కార్యదర్శిగా పనిచేశారు.

సంస్థలు - స్థాపకులు 
సంస్థ    సం.    స్థాపకులు 
హిందూ ధర్మ పరిషత్    1925    రాజా ప్రతాపగిర్జి
సొసైటీ ఆఫ్​ యూనియన్​ అండ్​ ప్రోగ్రెస్    1926    లండన్​లో హైదరాబాద్​ విద్యార్థులు
ఆల్​ ఇండియా ఉమెన్స్​ కాన్ఫరెన్స్    1927    మసుమా బేగం
హైదరాబాద్​ అసోసియేషన్    1930    బారిస్టర్ శ్రీకిషన్
ఇదారా ఇ అదాబియత్​    1930    ముస్లిం విద్యార్థులు
హిందూ స్థాయీ సంఘం    1932    కాశీనాథరావు వైద్య
ఆంధ్ర కేసరి సంఘం    1934    బూర్గుల రంగనాథరావు, కేసీ గుప్తా
సాహితీ మేఖల    1934    అంబపూడి వెంకటరత్నం
ముల్కీ లీగ్​    1935    నిజామత్​ జంగ్​
అంబేద్కర్ యూత్​ లీగ్    1936    బి.ఎస్.వెంకట్రావు
హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్    1938    స్వామి రామానంద తీర్థ