​బీజేపీ పట్ల ప్రజావ్యతిరేకత

నిజామాబాద్, వెలుగు:   అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి మాటనిలబెట్టుకోవాలన్నారు. శనివారం పార్టీ జిల్లా23వ మహాసభలకు హాజరై ప్రసంగించారు. ముందుగా ఎన్టీఆర్​ చౌరస్తా నుంచి రాజీవ్​గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఫొటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

 అనంతరం ఆమె మాట్లాడుతూ  సమాజానికి ప్రమాదకరమైన మతోన్మాద శక్తులను ఐక్యతతో వ్యతిరేకించాలన్నారు.ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్​, జిల్లా కార్యదర్శి సిర్ప లింగం పాటలతో ఉత్సాహపర్చారు.  రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్, రమ, జిల్లా కార్యదర్శి రమేశ్​బాబు,పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, వెంకటేశ్, శంకర్​గౌడ్, సుజాత, కొండ గంగాధర్, జంగం గంగాధర్​ పాల్గొన్నారు.