జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద

  • 45 గేట్లు ఓపెన్

గద్వాల, వెలుగు: కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్  డ్యామ్ తో పాటు మహారాష్ట్రలోని భీమా నది నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో ఆదివారం జూరాల ప్రాజెక్టు 45 గేట్లను ఓపెన్ చేసి నీటిని వదులుతున్నారు. కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది నుంచి జూరాల ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో గా వస్తోంది. నారాయణపూర్  డ్యామ్ లో 28.128 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 30 గేట్లు ఓపెన్ చేసి 1,02,250 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

ఈ ప్రాజెక్టుకు 1.30 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో గా ఉంది. మహారాష్ట్రలోని భీమా నదిపై ఉన్న సన్నతి బ్యారేజీకి కూడా వరద వస్తోంది. ఈ బ్యారేజీ నుంచి 1.75 లక్షల క్యూసెక్కు‌‌లు జూరాలకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులో 4.708 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 45 గేట్లు ఓపెన్  చేసి 3,88,683 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 3.82 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో గా వస్తోంది..