జూరాల గేట్లు క్లోజ్

గద్వాల, వెలుగు : కర్ణాటక తో పాటు కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా జూరాలకు వరద తగ్గుముఖం పట్టడంతో గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జూరాల గేట్లను క్లోజ్ చేసినట్లు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆఫీసర్లు తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు పైనుంచి వస్తున్న కొద్దిపాటి వరదతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.