జూరాల ప్రాజెక్టు వరద .. 42 గేట్లు ఓపెన్

జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. కర్నాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండడంతో జూరాల వద్ద గురువారం 42 గేట్లను ఓపెన్ చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు 3,41,111 లక్షల క్యూసెక్కులు,  నారాయణపూర్ డ్యామ్​కు 3.35 లక్షలు, జూరాల ప్రాజెక్టుకు 3.15 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో జూరాల వద్ద 42 గేట్లను ఓపెన్ చేసి 3.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

- గద్వాల, వెలుగు