కర్ణాటక నుంచి తగ్గిన వరద

  • భీమా నది నుంచి కొనసాగుతున్న వరద 
  • జూరాల దగ్గర 22 గేట్ల ద్వారా నీటి విడుదల

గద్వాల, వెలుగు: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి జురాలకు వరద తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్రలోని భీమా నది పై ఉన్న సనతి బ్యారేజ్ నుంచి  జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర మంగళవారం 27 గేట్లను ఓపెన్ చేసి నీటిని వదలగా రాత్రి వరకు వాటిని 22 గేట్లకు తగ్గించారు.  కృష్ణ నదికి ఉపనది అయిన భీమా నది నుంచి జూరాల ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోంది.

ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్ దగ్గర 30.348 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని  8,272 క్యూసెక్కుల నీటిని దిగివకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ల 20 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది. మహారాష్ట్రలోని బీమా నదిపై ఉన్న సన్నతి బ్యారేజీ కి కూడా వరద వస్తోంది. ఈ బ్యారేజీ నుంచి1.90 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదులుతున్నారు.  జూరాల ప్రాజెక్టు దగ్గర 4,322 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని 27  గేట్లను ఓపెన్ చేసి 2,09,067 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.