400 ఏండ్ల తర్వాత దగ్గరికి వస్తున్న గురు, శని గ్రహాలు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

400 ఏండ్ల తర్వాత దగ్గరికి వస్తున్న గురు, శని గ్రహాలు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సూర్యకుటుంబంలో పెద్ద గ్రహమైన గురుడు, చుట్టూ అద్భుతమైన రింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండే శని గ్రహం దగ్గరికొస్తున్నాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న అత్యంత దగ్గరగా రానున్నాయి. మనకు ప్రకాశవంతమైన నక్షత్రాల్లాగ కనబడనున్నాయి. ఇంతకుముందు 1623లో ఈ గ్రహాలు దగ్గరికొచ్చాయి. మళ్లీ 397 ఏండ్ల తర్వాత ఈ అద్భుతం జరగబోతోందని ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దగ్గరకు వచ్చిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని అన్నారు. దేశంలోని చాలా నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత గ్రహాలు దగ్గరికొచ్చే దృశ్యం చూడొచ్చు. గురు, శని గ్రహాలు మళ్లీ 2080 మార్చి 15న సమీపంలోకి రానున్నాయి.