కొల్లాపూర్ లో 100 పడకల హాస్పిటల్ ను అందుబాటులోకి తెస్తాం : జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: పట్టణ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం మార్నింగ్ వాక్ లో భాగంగా ఆసుపత్రి పనులను, మాతాశిశు హాస్పిటల్ ను సందర్శించారు. గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్​ జాతికి చేసిన సేవలను కొనియాడారు. 

విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చని, ఆర్థికంగా బలోపేతం అవుతామని తెలిపారు. మాలల చైతన్య సమితి రాష్ట్ర నాయకులు మద్దెల రామదాసు, హనుమంతు, ఎర్ర శ్రీను, హనుమంతు నాయక్  పాల్గొన్నారు.మంత్రి జూపల్లి  వల్లనే కొల్లాపూర్ అభివృద్ది సాధ్యం.

కాంగ్రెస్​లో చేరికలు..

పట్టణంలోని 11వ వార్డుకు చెందిన బీఆర్ఎస్​ పార్టీకి చెందిన 20 మంది ముఖ్య నాయకులు మంత్రి జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. క్యాంప్​ ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్  క్యాండిడేట్​ను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు.