శ్మశాన వాటిక పైకప్పు కూలిన ఘటన.. ముగ్గురు అధికారులు అరెస్ట్

శ్మశాన వాటిక పైకప్పు కూలిన ఘటన.. ముగ్గురు అధికారులు అరెస్ట్
యూపీ: ఓ వ్యక్తి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లి, అక్క‌డున్న శ్మ‌శాన వాటిక పై క‌ప్పు కూలి 25 మంది మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లో పోలీసులు ముగ్గురు అధికారుల‌ను అరెస్ట్ చేశారు. వీరిలో ఒక జూనియ‌ర్ ఇంజనీర్‌తో పాటు సూప‌ర్ వైజ‌ర్ కూడా ఉన్నారు. యూపీలో ఘ‌జియాబాద్‌లోని మురాద్‌నగర్‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్రంగా గాయ‌పడ్డారు.  జై రామ్ అనే వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన మృతుడి బంధువులు వర్షం కారణంగా అక్క‌డ నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో వర్షం కారణంగా భవనం పైకప్పు కూలిపోవ‌డంతో.. శిథిలాల క్రింద చిక్కుకొని 25 మంది చ‌నిపోయారు. చ‌నిపోయిన వారంతా మగవారేనని అధికారులు తెలిపారు. ఆ భ‌వ‌న నిర్మాణంలో నాణ్య‌త లోపించి , అంత‌మంది చావుకు కార‌ణ‌మైన జూనియ‌ర్ ఇంజనీర్ చంద్ర‌పాల్, సూప‌ర్ వైజ‌ర్ ఆశీష్, ఈవో నిహారిక సింగ్, కాంట్రాక్ట‌ర్ అజ‌య్ త్యాగి ల‌పై పోలీసులు ప‌లు సెక్ష‌న్‌ల క్రింద‌ కేసు న‌మోదు చేశారు.