అదృష్టం ఎవరిది..? : 2024, జూన్ 4వ తేదీ 12 రాశుల జాతకాలు ఎలా ఉన్నాయి..?

జూన్ 4, 2024 తేదీ జోతిష్యం ఎలా ఉంది.. ఏ రాశుల వారికి ఎలా ఉంది.. తిధి, వారం, నక్షత్రం,  వర్జ్యం, రాహుకాలం, శుభ ఘడియలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడే ఇది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు. జూన్ 4వ తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలో రేపటి రోజు ఎలా ఉంది అని పోటీ చేసిన అభ్యర్థులు, బెట్టింగ్ రాయుళ్లు.. ఆయా పార్టీలు తెగ చూసేస్తున్నాయి.అసలు ఈ రోజు ( జూన్​ 4)  తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల సమయాలతో పాటు, వర్జ్యం, దుర్ముహూర్తం లాంటి చెడు సమయాలు, అమృత ఘడియల లాంటి మంచి సమయాల వివరాలు తెలుసుకుందాం

నేటి రాశిఫలం, జూన్ 4, 2024: జ్యోతిష్య సిద్దాంతం ప్రకారం  ఈరోజువైశాఖమాసం  కృష్ణ పక్షం  ... మంగళవారం... కృష్ణ-త్రయోదశి తిథి   రాత్రి 10.02 గంటల వరకుఉంటుంది. జూన్​ 4ఉదయం 9.11 గంటల వరకు సౌభాగ్య యోగం ఉంటుందని, ఆ తర్వాత శోభన యోగం ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి  భరణి నక్షత్రం రాత్రి 10.36 వరకు ఉంటుంది. అయితే వర్జ్యం లేదు కాని.. దుర్మహూర్తం మాత్రం ఉదయం 08:19 నుంచి  ఉదయం 09:12 వరకు మరల రాత్రి 11:08 నుంచి 11:52 వరకు ఉంటుంది. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 03.30 నుంచి సాయంత్రం 05.07 వరకు ఉండగా.. అమృత ఘడియలు  సాయంత్రం 06.06 నుంచి 07.36 వరకు ఉన్నాయి. ఇక  జూన్​ 4న ద్వాదశ (12) రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. . . 

1. మేషరాశి:  మేషరాశివారికి  ఉద్యోగ పరంగా, ఆర్థికంగా బాగుంటుంది.   తక్కువ పని ఒత్తిడి వలన  సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు ఏ పని అయినా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. అయితే మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. కొన్నిసార్లు అత్యుత్సాహానికి పోయి మీకు సంబంధం లేని పనుల్లో తలదూర్చే అవకాశముంటుంది. వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి ఎదుగుదలను కలిగి ఉంటారు.  కోపం కారణంగా ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండటం మంచిది. రాజకీయ నేతలకు మిశ్రమ ఫలితాలుంటాయి.  

2. వృషభ రాశి : ఈ రాశికి   మిశ్రమ ఫలితం ఉంటుంది.  కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  మీరు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాల్సి రావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.రాజకీయంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  చాలాకాలం నుంచి మీకు రాకుండా ఆగిపోయిన డబ్బు ఈ నెలలో మీకు అందటం వలన ఆర్థిక భారం కొంత మేరకు తగ్గుతుంది. వృత్తి, వ్యాపారం..  పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆవేశానికి లేదా తొందరపాటుకు లోనయ్యి పెట్టే పెట్టుబడులు నష్టాలను వచ్చే అవకాశం ఉంటుంది.

3.  మిథునరాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అదనపు పనిభారం  వలన సహనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది . మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయనేతలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాన్ని పొందడానికి వ్యాపారవేత్తలు చాలా కష్టపడాలి.  కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి మిత్రులు కానీ లేదా ఆర్థిక సంస్థలు కానీ సహాయం అందించడం వలన  సజావుగా సాగుతుంది.మీకు మీ స్నేహితులు , ఇతర బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది,

4. కర్కాటక రాశి: ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొంత మెరుగుదల లేదా ప్రమోషన్ ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. పొలిటికల్​ రంగంలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొవలసి ఉంటుంది. చంద్రుడు పై కుజుడు దృష్టి కారణంగా మీలో అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే  పని ఒత్తి ఎక్కువ అవటం జరుగుతుంది.  ఆర్థికంగా  ఉన్న సమస్యలు కొంత మేరకు తగ్గుతాయి. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొత్త అవకాశాలు వస్తాయి.  అత్యుత్సాహం కారణంగా మీకు తెలియకుండానే తప్పులు చేసే అవకాశం ఉంటుంది.

5. సింహ రాశి :  ఈ రాశి వారు  ఉద్యోగ విషయంలోనూ..  ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. మీ పై అధికారులు ..  మీ సహోద్యోగుల నుంచి మీరు ప్రశంసలు పొందవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి పొందడం కానీ లేదా అనుకున్న స్థానానికి బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది. రాజకీయరంగంలో ఉన్న వారు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఈ నెల అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీకు మంచి డబ్బు ప్రవాహం ఉంటుంది. ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.   మీరు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా  లాభాలు వస్తాయి.  ఈ నెలలో పుణ్యక్షేత్ర సందర్శన కానీ దూర ప్రయాణం కానీ ఉంటుంది.

6. కన్యా రాశి : ఈ రాశి వారికి  మంచి ఫలితం ఉంటుంది.  కెరీర్ వారీగా అనుకూలమైన సమయం. ఆర్థికంగా కొంత ఖర్చు ఉంటుంది. మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పై అధికారుల నుంచి మంచి మద్దతు .. ప్రశంసలు ఉంటాయి. రాజకీయంలో ఉన్న వారు సామాన్య ఫలితాలు పొందుతారు.  విదేశాలలో అవకాశం ..  మెరుగైన మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు  ఆశించిన ఫలితాన్ని పొందుతారు.ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అయితే  కుజుడు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దూర ప్రయాణం కాని చేసే అవకాశం ఉంది. 

7. తులా రాశి: ఈ రాశి  వారికి  మిశ్రమ ఫలితం ఉంటుంది.  కెరీర్ పరంగా కఠినమైన సమయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఎక్కువగా మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించండి,  ఒకవేళ మీరు ఉద్యోగ మార్పు లేదా బదిలీ కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే  వేచి ఉండటం మంచిది.  ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు చాలా కష్టపడాలి. రాజకీయనేతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం కాదు. రాజకీయ నాయకులు ..  ప్రభుత్వ అధికారులతో   మీకు కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున .. వారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

8. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కెరీర్​ పరంగా ఒత్తిడి.. పనిభారం ఉంటుంది. కార్యాలయంలో అదనపు సమయం పనిచేయవలసి రావచ్చు.  అంతేకాకుండా కొన్ని అదనపు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. పొలిటికల్​ రంగంలో ఉన్న వారు అతి కష్టంపై సానుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు వేరే ప్రదేశంలో పనిచేయాల్సి ఉంటుంది. సహోద్యోగుల నుంచి ఆశించిన రీతిలో మద్దతు ఉంటుంది.  కుజుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు మరియు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కొన్ని అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

9. ధనుస్సు రాశి  : ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రమోషన్​ పొందే అవకాశం... స్థాన చలనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కొన్ని అదనపు బాధ్యతల వలన పనిభారం ఉండే అవకాశం ఉంది. కుజుడి గోచారం నాలుగవ ఇంటి నుంచి ఐదవ ఇంటికి మారటం వలన గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది.  రాజకీయ రంగంలో ఉన్నవారు సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం. కొత్తపెట్టుబడుల ద్వారా మీకు ఆదాయం మరియు డబ్బు లాభం పెరుగుతుంది.  అనుకోని ఖర్చులు కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది.

10.  మకర రాశి: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి, వ్యాపారం, రాజకీయంలో ఉన్నవారు  విషయంలో కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటారు.  మీ ఆలోచనలకు ఎవరో ఒకరు చెప్పడం వలన మీరు కొంత చికాకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం విషయంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.  కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూల ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం.  కుజుని గోచారం అనుకూలంగా ఉండదు . అందువల  కొత్తగా స్థిరాస్థులు కొనాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. మీరు ఆవేశాన్ని కానీ కోపాన్ని కానీ అదుపులో ఉంచుకోవడం మంచిది.ఆశించిన విజయాన్ని సాధించడంపై మరింత దృష్టి పెట్టాలి. 

11. కుంభ రాశి:  ఈ రాశి  వారికి పనిభారం ఎక్కువ అవడంతో కెరీర్​లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి.  మీరు అన్న పదాన్ని వేరే విధంగా అర్దం చేసుకునే అవకాశం ఉంది. రాజకీయనేతలకు గడ్డుకాలమని పండితులు చెబుతున్నారు. మీకు ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎక్కువ అవుతారు. అయితే   కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా  మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకుంటారు కావున ఆర్థిక సమస్యలను అధికమిస్తారు. స్థిరాస్తులు కారణంగా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల్లో లాభాలు రావటం వల్ల కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశం ఉంటుంది.

12. మీన రాశి: ఈ రాశి  వారు  చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న పదోన్నతి కూడా అందుకునే అవకాశం ఉంటుంది. పనిభారం పెరిగి  అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి రావచ్చు. పొలిటికల్​ రంగంలో ఉన్నవారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అ​నవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా ఉండటం మంచిది. ఈ సమయంలో మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాకపోవడంతో మరింత ఎక్కువ కష్టపడాలని చూస్తారు . దాని కారణంగా చేయాల్సిన దానికంటే ఎక్కువ సమయం పని చేయడం  వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మెరుగైన వృద్ధితో పాటు   ఊహించని డబ్బును పొందుతారు. అయితే  సూర్యుడు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. . వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితం ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది.