జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి 

దేవర సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాన్సర్ తో బాధపడుతున్న వీరాభిమాని కౌశిక్ కు సాయం చేస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్ తమకు ఎలాంటి సాయం చేయలేదంటూ కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకొచ్చింది.  క్యాన్సర్ తో బాధపడుతున్న తన కుమారుడు కౌశిక్ కు వైద్య సాయం చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారని అన్నారు సరస్వతి.

దేవర సినిమా రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్ తనతోను, తన కుమారుడితోనూ వీడియో కాల్ లో మాట్లాడి వైద్యం కోసం డబ్బులు ఇస్తానని చెప్పారని.. ఇప్పటిదాకా పైసా కూడా ఇవ్వలేదని అన్నారు సరస్వతి.

ALSO READ | టాలీవుడ్ లో టెన్షన్..బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!

ప్రస్తుతం కౌశిక్ కు చెన్నైలో అపోలో చికిత్స పూర్తయిందని.. ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీ నుండి రూ.40 లక్షలు ఆర్థిక సాయం అందిందని తెలిపింది సరస్వతి.ఇంకా రూ. 20 లక్షలు కట్టాలని ఆసుపత్రి వారు అడుగుతున్నారని..జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు తమకు పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది సరస్వతి.

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి pic.twitter.com/LCpho6mVjk

— DJ MANI VELALA (@MaNi_ChiNna_) December 23, 2024