చందానగర్, వెలుగు : జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ యూనియన్ఆఫ్వర్కింగ్ జర్నలిస్ట్ పనిచేస్తుందని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్‌సాగర్ చెప్పారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం మంగళవారం చందానగర్‌లోని పీజేఆర్స్టేడియంలో జరిగింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి విఠల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శేఖర్‌సాగర్
ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ సాగర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, ఇండ్ల స్థలాల అంశాలపై చర్చించారు. అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్లక్ష్మణ్రావుకు శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ తరుఫున రూ.50వేల అందజేశారు.
