Mohammed Siraj: సిరాజ్ మంచి వ్యక్తిత్వం కలవాడు: తెలుగోడిపై జోష్ హాజెల్‌వుడ్ ప్రశంసలు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ కు విలన్ లా కనిపిస్తున్నాడు. అతని తీరు ఆసీస్ అభిమానులకు నచ్చడం లేదు. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పై బంతిని విసిరి వేయడం.. ట్రావిస్ హెడ్ ను ఔట్ చేసిన అతను చూపించిన అత్యుత్సాహం విమర్శలకు గురి చేసింది. ముఖ్యంగా హెడ్ తో గొడవ విషయంలో ఐసీసీ సిరాజ్ ను గట్టిగా మందలించింది. అతని మ్యాచ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. 

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు సిరాజ్ కు ఐసీసీ ఈ శిక్ష విధించింది. దీంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ను విధించారు. అయితే సిరాజ్ ను ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్రశంసించాడు. అతడు మంచి వ్యక్తిత్వం కలవాడని కొనియాడాడు. ఐపీఎల్ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున హాజెల్‌వుడ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన డ్రెస్సింగ్ రూమ్ లో సిరాజ్, కోహ్లితో కలిసి ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నాడు.  

Also Read:-ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన కోచ్‌గా జోనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ పొడిగింపు..

‘‘సిరాజ్‌తో కలిసి ఆర్‌సీబీలో గడిపిన సమయాన్ని చాలా ఆస్వాదించాను. అతను ఫాస్ట్ బౌలింగ్ కు నాయకుడు. ఆటలో అతను విరాట్ కోహ్లీలా ఉండే మరొకడు. చాలా ఉద్వేగభరితమైనవాడు. ఆట ఆడుతున్నంత సేపు అతనిది దూసుకెళ్లే స్వభావం. ఐపీఎల్ లో చివరి కొన్ని సీజన్ లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అని హాజెల్‌వుడ్ తెలిపాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమైన హాజెల్‌వుడ్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది.