పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. పక్కనొప్పి కారణంగా ఈ ఆసీస్ పేసర్ అడిలైడ్ టెస్ట్ ఆడడం లేదు.
హేజిల్‌వుడ్ స్థానంలో ఇద్దరు పేసర్లను ఆస్ట్రేలియా ప్రకటించింది. అన్క్యాప్డ్ పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్‌లను స్క్వాడ్ లో చేర్చారు. హేజిల్‌వుడ్ దూరం కావడంతో రెండు టెస్ట్ ప్లేయింగ్ 11 లో స్కాట్ బోలాండ్ ఆడడం దాదాపుగా ఖాయమైంది. అతను ఇప్పటికే స్క్వాడ్ లో ఉన్నాడు. స్టార్క్, కమ్మిన్స్ లతో బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. 2023లో లీడ్స్‌లో జరిగిన యాషెస్ టెస్టులో చివరిసారిగా ఆడిన బోలాండ్.. మరోసారి ఆసీస్ తుది జట్టులో ఆడే అవకాశం లభించనుంది.
ALSO READ : పింక్ ప్రాక్టీస్: బ్యాటింగ్ కాంబినేషన్‌పై టీమిండియా ఫోకస్
బోలాండ్ భారత్ పై చివరిసారిగా ఆస్ట్రేలియాపై టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాడు. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ వికెట్ కూడా ఉంది. హేజిల్‌వుడ్ దూరమైనా.. బోలాండ్ తో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తుంది. అతను అడిలైడ్ టెస్టుకు ముందు జరిగే ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్ వార్మప్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ తొలి రోజు వర్షం కారణంగా రద్దయింది. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
? NEWS ALERT ?
— CricTracker (@Cricketracker) November 30, 2024
Josh Hazlewood has been ruled out of the second Test against India due to a low-grade injury on his left side. pic.twitter.com/u6cL4aWxmS