IND vs AUS 3rd Test: గాయంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్లిన హేజిల్‌వుడ్

గబ్బా టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. అతను నాలుగో రోజు కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేసి గ్రౌండ్ ను వదిలి వెళ్ళాడు. కాలు పిక్కలు పట్టేయడంతో అతను బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో వచ్చి అతన్ని తీసుకెళ్లాడు. అతడిని స్కానింగ్ కు పంపించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. వేసిన కొన్ని ఓవర్లు 132 కి.మీ వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఈ ఆసీస్ పేసర్ కోహ్లీ వికెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హేజల్ వుడ్ గాయం విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. 

నాలుగో రోజు హేజల్ వుడ్ దూరం కావడంతో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. ఫాస్ట్ బౌలింగ్ భారమంతా కెప్టెన్ కమ్మిన్స్, స్టార్క్ లపై పడనుంది. గాయం కారణంగా తొలి రెండో టెస్టుకు దూరమైన ఈ ఆసీస్ పేసర్ కోలుకొని మూడో టెస్టుకు వచ్చేశాడు. ఈ మ్యాచ్ విషయానికి ఆస్ట్రేలియా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ భారత్ డ్రా చేసుకోవాలని చూస్తుంది. వర్షం అంతరాయం కలిగిస్తే ఈ మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

ALSO READ : IND vs AUS 3rd Test: అరగంటలో 445 పరుగులు చేయలేరు.. టీమిండియాపై దిగ్గజ క్రికెటర్ ఫైర్

నాలుగో రోజు లంచ్ తర్వాత భారత్ ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (60), సిరాజ్(0) ఉన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో మరో 249 పరుగులు వెనకబడి ఉంది. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 49 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు రాహుల్ (82), జడేజా (60*) రాణించగా రోహిత్ శర్మ (10), నితీష్ కుమార్ (16) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్ కు రెండు వికెట్లు దక్కాయి. లియాన్, హేజాల్ వుడ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది.