గరుడ శక్తి సైనిక విన్యాసాలు

గరుడ శక్తి పేరిట సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసాల 9వ ఎడిషన్​ నవంబర్​ 1 నుంచి 22 వరకు ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్నా యి. రెండు దేశాల సైన్యాల ప్రత్యేక బలగాల మధ్య అవగాహన, సహకారం పెంపొందించడం కోసం ఈ విన్యాసాలు జరుపుతున్నారు.

ALSO READ : వజ్ర ప్రహార్ యుద్ధ విన్యాసాలు

రెండు దేశాల మధ్య సత్సంబంధాలను, ప్రాంతీయ భద్రతను పెంచడం, ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక దళాల నైపుణ్యాలను పెంచడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ఆయుధాలు, పరికరాలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, విధానాలు, పలు ఆపరేషన్ల నుంచి నేర్చుకున్న వాటి నుంచి సమాచారాన్ని పరస్పరంగా పంచుకోవడం దీని లక్ష్యం. అడవుల్లో ప్రత్యేక దళ ఆపరేషన్లు, ఉగ్రవాద శిబిరాలపై దాడులు, ఇరుదేశాల జీవనశైలి, సంస్కృతి గురించి అవగాహన పెంచడం ఈ సంయుక్త శిక్షణ విన్యాసాల్లో భాగం.