రేపు టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది . సుమారుగా 60 నుంచి 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వివాదాలు లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో ఇరు పార్టీలుఉన్నట్లు సమాచారం. ముఖ్యనేతలు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఇరు పార్టీల సమాచారం అందించారు.
శుక్రవారం సాయంత్రం చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోగా.. పవన్ కల్యాణ్ విడిగా అమరావతికి చేరుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ముఖ్య నేతలతో కలిసి జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అటు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కూడా పవన్ కల్యాణ్ జాబితాపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
.ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇన్ ఛార్జ్ లును ప్రకటించారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. అనకాపల్లి పార్లమెంట్ బరిలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగాబాబును బరిలోకి దించాలని జనసేన నిర్ణయించింది. భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.