పోలీస్  డ్యూటీ మీట్ ను ప్రారంభించిన డీఐజీ

పాలమూరు, వెలుగు: జిల్లా పోలీస్​ ఆఫీస్​లో బుధవారం జిల్లా స్థాయి పోలీస్​ డ్యూటీ మీట్​ను జోగులాంబ జోన్  డీఐజీ ఎల్ఎస్  చౌహాన్  ప్రారంభించారు. జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది తమ పోలీస్​ విధుల నైపుణ్యాలను ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. ఈ మీట్ లో వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు.

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పోలీస్​ ఆఫీస్​లో జిల్లా పోలీస్​ డ్యూటీ మీట్​ను ఎస్పీ యోగేశ్​ గౌతమ్ ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటిసారిగా పోలీస్  డ్యూటీ మీట్ లో తమ ప్రతిభను చూపించాలని సూచించారు. చట్టాల అమలు, అంతర్గత భద్రత, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడంలో మెరుగు పర్చుకోవచ్చన్నారు.