జోగులాంబ ఆలయ హుండీ ఆదాయం రూ. 45 లక్షలు

అలంపూర్, వెలుగు:  జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం హుండీ  లెక్కింపు చేపట్టారు.  అమ్మవారి ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపులో  38 లక్షల 75 వేల 701 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.  స్వామివారి ఆలయంలో 5 లక్షల 81 వేల 150 ఆదాయం వచ్చిందన్నారు.

 అన్నదాన సత్రంకు సంబంధించి రూ.62 వేల 123 రూపాయల ఆదాయం రాగా మెత్తం రూ.45 లక్షల 18వేల 974 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఆలయ కమిటీ చైర్మన్ చిన్నకృష్ణయ్య, ఆలయ ప్రధానార్చకులు ఆనంద్ శర్మ, సభ్యులు వెంకటేశ్, నీలప్ప  ఏపీజీవీబీ మేనేజర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.