మొబైల్ రికవరీ లో గద్వాల జిల్లాకు ఐదో స్థానం : ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు :  సీఈఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మొబైల్ రికవరీ శాతంలో జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో 5 వ స్థానంలో నిలిచిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.  ఈ మేరకు డీజీపీ జితేందర్ అభినందించారన్నారు.  

మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ఐటీ సెల్ సెల్ ఇన్చార్జి ఎస్ఐ రజిత ప్రశంసాపత్రం అందుకున్నారు. ఏప్రిల్ 2023 నుంచి అక్టోబర్- 2024 వరకు 948  సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను ఓనర్లకు అందజేశామన్నారు.