డ్యూటీలో నిర్లక్ష్యం..ఫార్మసిస్ట్ సస్పెన్షన్ 

  •     డుమ్మా కొట్టిన 14 మంది వైద్య సిబ్బందికి కలెక్టర్‌‌ షోకాజ్ 

గద్వాల, వెలుగు : డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సర్కార్ దవాఖానను కలెక్టర్‌‌ తనిఖీ చేశారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫార్మసిస్ట్ పై సస్పెన్షన్ వేటు వేశారు. విధులకు డుమ్మా కొట్టిన 14 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో అన్ని వార్డులను తిరిగి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఎంతమంది డాక్టర్లు కరెక్ట్ సమయానికి వచ్చారని పరిశీలించారు.

ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు 14 మందితో పాటు మరో నలుగురు వైద్య సిబ్బంది డుమ్మా కొట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్టాక్ వివరాలను సరిగా నిర్వహించని ఫార్మసిస్ట్ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి ఉన్నారు.