గద్వాల, వెలుగు: ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ఎగ్జామ్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గ్రూప్ 2 నిర్వహణపై రివ్యూ చేశారు. జిల్లావ్యాప్తంగా 8,722 అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారని, వీరి కోసం 25 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించేందుకు 25 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 25 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, 74 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు.
అలాగే 14న అన్ని విద్యాసంస్థల్లో కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టూడెంట్స్ పేరెంట్స్ పాల్గొంటారన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును వివిధ రాజకీయ పార్టీల లీడర్లతో కలిసి పరిశీలించారు.