Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన

భారత పర్యటన, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్ నాయకత్వంలో 15 మంది సభ్యులు గల బలమైన జట్టును ఎంపిక చేసింది. టెస్ట్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోగా.. ఇటీవల జరిగిన సిరీస్‌లలో సెంచరీల మీద సెంచరీలు బాధేస్తున్న వెటరన్ క్రికెటర్ జో రూట్ తిరిగొచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.ఈ సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఒకరకంగా ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇరు జట్లకు సన్నాహక మ్యాచ్‌లుగా ఉపయోగపడనుంది.

ALSO READ | U19 Women's Asia Cup: మెరిసిన తెలంగాణ బిడ్డ.. అండర్ -19 ఆసియా కప్ విజేత టీమిండియా

ఇంగ్లండ్ జట్టు: 

జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్.

భారత్ vs ఇంగ్లండ్ వైట్-బాల్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టీ20: జనవరి 22 (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
  • రెండో టీ20: జనవరి 25  (చిదంబరం స్టేడియం, చెన్నై)
  • మూడో టీ20: జనవరి 28 (నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్)
  • నాలుగో టీ20: జనవరి 31 (MCA స్టేడియం, పూణె)
  • ఐదో టీ20:  ఫిబ్రవరి 2 (వాంఖడే స్టేడియం, ముంబై)
  • మొదటి వన్డే:  ఫిబ్రవరి 6 (VCA స్టేడియం, నాగ్‌పూర్)
  • రెండో వన్డే:  ఫిబ్రవరి 9 ఆదివారం (బారాబతి స్టేడియం, కటక్)
  • మూడో వన్డే: ఫిబ్రవరి 12 (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)