ENG vs PAK 1st Test: రూట్ డబుల్ సెంచరీ.. పాక్ బౌలర్లను దంచి కొడుతున్న ఇంగ్లాండ్

ముల్తాన్ టెస్టులో పాక్ కష్టాలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై ఫ్లాట్ పిచ్ లు తయారు చేసుకొని నానా అవస్థలు పడుతున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ల దెబ్బకు వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్నరూట్ డబుల్ సెంచరీతో అదరగొడితే.. మరో ఎండ్ లో యువ ప్లేయర్ హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. దీంతో నాలుగో రోజు తొలి సెషన్ లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 3 వికెల నష్టానికి 536 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్రీజ్ లో రూట్ (200), బ్రూక్ (160) ఉన్నారు. 

రూట్, బ్రూక్ నాలుగో వికెట్ కు 287* పరుగులు జోడించడం విశేషం. వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరూ వన్డే మాదిరి ఆడుతూ వేగంగా పరుగులు చేస్తున్నారు. మూడో రోజు ఆటలో సెంచరీ చేసి పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన రూట్.. డబుల్ సెంచరీతో మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రూట్ టెస్ట్ కెరీర్ లో ఇది ఆరో డబుల్ సెంచరీ కావడం విశేషం. మరో వైపు బ్రూక్ 150 పరుగుల మార్క్ పూర్తి చేసుకున్నాడు.

చేతిలో 7 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం రాబట్టడం గ్యారంటీ. ఓపెనర్ క్రాలీ (78) డకెట్(84) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్  కెప్టెన్ షాన్ మసూద్‌‌ (151), ఓపెనర్‌‌‌‌ అబ్దుల్లా షఫీక్‌‌ (102) అఘా సల్మాన్ (104) సెంచరీలతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ స్కోర్ చేసినా ఈ మ్యాచ్ లో పాక్ డేంజర్ జోన్ లో ఉంది.