సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం మతీశా పతిరానా జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. 2025 సీజన్ లో వైల్డ్ కార్డ్ పిక్‌గా మతీషా పతిరానను కొనుగోలు చేసినట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. వైల్డ్‌కార్డ్ ఎంపికకు డిసెంబర్ 30 వరకు సమయం ఉన్నప్పటికీ సూపర్ కింగ్స్ బుధవారం (అక్టోబర్ 2) ఉదయం శ్రీలంక పేసర్ పతిరానాను తమ వైల్డ్ కార్డ్ ప్లేయర్‌గా ధృవీకరిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.
సూపర్ కింగ్స్ జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ , మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో లాంటి అనుభవజ్ఞులైన బ్యాటర్‌లు ఉన్నారు. మతీషా పతిరానా చేరికతో వారి జట్టు మరింత పటిష్టంగా మారనుంది. ఇమ్రాన్ తాహిర్, తబ్రైజ్ షమ్సీ, నాంద్రే బర్గర్‌లతో పతిరానా బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటాడు. ఆరు జట్లు తలపడే ఈ టోర్నీ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభం కానుంది.
Also Read :- 147 ఏళ్ళ టెస్ట్ క్రికెట్‌లో భారత్ సరికొత్త చరిత్ర
మంగళవారం(అక్టోబర్ 01) కేప్ టౌన్ వేదికగా జరిగిన ఈ వేలంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 115 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో సహా మొత్తం 188 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొన్నారు. వీరిలో 13 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అంతర్జాతీయ స్టార్లు టెంబా బావుమా, జోష్ లిటిల్, టోనీ డి జోర్జి వంటి వారి కోసం ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.
బరిలో ఆరు జట్లు
-ఎంఐ కేప్ టౌన్
-పార్ల్ రాయల్స్
-ప్రిటోరియా క్యాపిటల్స్
-సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
-జోబర్గ్ సూపర్ కింగ్స్
-డర్బన్ సూపర్ జెయింట్స్
Matheesha Pathirana Joins JSK as Wild Card Pick ?? pic.twitter.com/V98Tf8JoKv
— CricketGully (@thecricketgully) October 2, 2024