పిల్లల్ని ఆడించడానికేనా ఇంత చదివింది.. అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఘోరం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యఘోచరంగా ఉంది. మాస్టర్స్ అవ్వగానే ఉద్యోగం దొరుకుతుందని అనుకునే వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. చదువు తగ్గ జాబ్ కాదు.. కనీసం పార్ట్ టైం జాబ్ కూడా దొరకడం లేదు. గతంలో ఇండియా నుంచి అక్కడికి వెళ్లిన స్టూడెంట్స్ కి రోజువారీఖర్చుల కోసం పని చేసుకునేందుకు పార్ట్ టైం జాబ్స్ బానే దొరికేవి. పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్‌, హోటల్స్, ఫుడ్ ట్రక్కులు, హౌస్ కీపింగ్ ఇలాంటి పనులు ఈసీగా వచ్చేవి. గంటలకు 13 నుంచి 18 డాలర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు అమెరికాలో పార్ట్ టైం జాబ్ కోసం ముందుకొచ్చే వారి సంఖ్య పెరగడంతో వారికిచ్చే జీతాలు కూడా తగ్గాయి. ప్రస్తుతం గంటలకు 10 డాలర్లు మాత్రమే ఇస్తున్నారు.    

పార్ట్ టైం జాబ్స్ లేక.. చాలామంది అమ్మాయిలు బేబీ కేర్ టేకర్ గా కుదురుతున్నారు. తెలంగాణా, ఆంధ్రా ఇతర రాష్ట్రాల నుంచి మాస్టర్స్ కోసం యూస్ వెళ్లిన వారి సిచువేషన్ పూట గడిస్తే చాలు అన్న తీరులో  ఉంది. అమెరికాలో భార్యభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తుంటారు. వాళ్ల పిల్లల ఆలనాపాలనా చూస్తే గంటకు13 నుంచి 18 డాలర్లు, ఫుడ్ తోపాటు షెల్టర్ కూడా ఇస్తారంట. 2023లో భారతదేశంలో జారీ చేయబడిన US స్టూడెంట్ వీసాలలో 56శాతం ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్లే ఉన్నారంట. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం.. టెక్సాస్‌లో 39,000 మంది, ఇల్లినాయిస్‌లో 20,000 మంది, ఒహియోలో 13,500 మంది, కనెక్టికట్‌లో 7,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు 50శాతం తెలుగు విద్యార్థులే. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉన్నందున బేబీ సిట్టింగ్‌కు తక్కువ వేతనం ఇస్తున్నారని విద్యార్థులు చెప్తున్నారు.