మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు నేరుగా ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ నేవీ. కరోనా కారణంగా రాత పరీక్ష లేకుండా మార్కుల మెరిట్ ఆధారంగా కేవలం ఇంటర్వ్యూలతో 210 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. పైలట్, అబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ (ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రికల్) తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇండియన్ నేవీ వివిధ బ్రాంచుల్లోని పర్మనెంట్ కమిషన్ (PC), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మొత్తం పోస్టుల సంఖ్య : 210
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (SSC) – 122 పోస్టులు
టెక్నికల్ (SSC) – 70 పోస్టులు
ఎడ్యుకేషన్ బ్రాంచ్ – 18 పోస్టులు
అర్హత :
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, MSC,BSC,BCOM , BSC (IT), PG DIP / MBA,MCA, ,MSC (IT),DGCA జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి. అలాగే నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక విధానం :
కరోనా కారణంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్వీస్ సెలెక్షన్ బోర్డు (SSB) ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది. కనీసం 8,300 మందిని ఇంటర్య్వూకి ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూలు బెంగళూరు/భోపాల్/విశాఖపట్నం/కోల్‌కతాలో నిర్వహిస్తారు. పైలట్/అబ్జర్వర్ పోస్టులకు ఇంటర్వ్యూ బెంగళూరులోనే ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు E-Mail,SMS ద్వారా సమాచారమిస్తారు.
SSB ఇంటర్వ్యూ షెడ్యూల్ : ఫిబ్రవరి 21, 2021 నుంచి
కోర్సు ప్రారంభం : జూన్ 2021
ట్రైనింగ్ సెంటర్ : ఇండియన్ నేవల్ అకాడమీ(INA)ఎజిమల-కేరళ
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది : డిసెంబర్ 31, 2020
వెబ్ సైట్ : https://www.joinindiannavy.gov.in/
