IND vs SA 4th T20: సౌతాఫ్రికాతో చివరి టీ20.. రింకూ స్థానంలో వికెట్ కీపర్‌కు ఛాన్స్

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఖరి సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిద్ధమైంది. శుక్రవారం (నవంబర్ 15) జరిగే నాలుగో (చివరి) టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడిపోయినా వెంటనే తేరుకొని సెంచూరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని సాధించి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకుంటుంది. మరోవైపు సౌతాఫ్రికాపై సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. చివరి టీ20 లో గెలిస్తే సిరీస్ సమం చేసుకోగలుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. 

వరుసగా ఫెయిలవుతున్న ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాడిలో పడినట్టు కనిపిస్తోంది. అయితే, సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గాలంటే మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రాణించాల్సిందే.  ముఖ్యంగా రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుసగా విఫలం కావడంతో మిడిల్ ఆర్డర్ లో పరుగుల వేగం మందగిస్తుంది. టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంచి హిట్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రింకూ కొన్ని నెలలుగా ఆకట్టుకోవడం లేదు.గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ 11, 9, 8 స్కోర్లతో 28 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేశాడు.

ALSO READ | India vs India A: కుర్రాళ్లతో మ్యాచ్: ప్రాక్టీస్‌లోనూ కోహ్లీ విఫలం.. పంత్‌ను బౌల్డ్ చేసిన నితీష్

తనకు అప్పజెప్పిన ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. అయినా  కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్య, తాత్కాలిక కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతనిపై నమ్మకం ఉంచడంతో అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ రోజు మ్యాచ్ లో రింకూ స్థానంలో వికెట్ కీపర్ జితేష్ శర్మకు ఛాన్స్ దక్కొచ్చు. జితేష్ ఇప్పటికే భారత్ తరపున టీ20లో అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. దీంతో అతనికి అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే భారత జట్టులో మార్పులేవీ ఉండకపోవచ్చు. 

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేలిపోయిన తర్వాత గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో సౌతాఫ్రికా అద్భుతంగా ఆడింది. గెబెహాలో ఓటమి అంచుల నుంచి తేరుకొని గెలిచిన ఆ జట్టు సెంచూరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఛేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినంత పని చేసింది. వ్యక్తిగతంగా ఒకరిద్దరు ఆకట్టుకుంటున్నా సమష్టిగా రాణించలేకపోవడంతోనే ఆ జట్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1–2తో వెనకబడింది. సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమం చేయాలంటే మిగతా బౌలర్లు రాణించడంతో పాటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సఫారీలు మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.