వాట్సాప్​ ద్వారా కిరాణ సరుకుల షాపింగ్

వాట్సాప్​ ద్వారా కిరాణ సరుకుల షాపింగ్

న్యూఢిల్లీ: మార్క్ జుకర్‌‌‌‌బర్గ్‌‌‌‌కు చెందిన మెటా, రిలయన్స్​కు చెందిన జియోలు..మెసేజింగ్ ప్లాట్‌‌‌‌ఫారమ్ వాట్సాప్,  జియోమార్ట్‌‌‌‌ల ఇంటిగ్రేషన్​ను పూర్తి చేశాయి. తాజా ప్రకటన ప్రకారం జియోమార్ట్ సేవలు​ భారతదేశం అంతటా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. నేరుగా ఆర్డర్‌‌‌‌లను బుక్ చేసుకోవడానికి, డబ్బు చెల్లించడానికి వాట్సాప్ ఉపయోగపడుతుంది. ఈ  రెండు కంపెనీలు పోయిన డిసెంబర్‌‌‌‌లో గ్రాసరీ ప్రాజెక్ట్ కోసం పైలట్ దశను చేపట్టాయి.

సోమవారం జరిగిన జియో వార్షిక సాధారణ సమావేశం తర్వాత జుకర్‌‌‌‌బర్గ్ పూర్తి రోల్ అవుట్‌‌‌‌ను ప్రకటించారు. ఆన్‌‌‌‌లైన్ కిరాణా డెలివరీ ప్లాట్‌‌‌‌ఫారమ్ జియోమార్ట్​ను ముకేశ్​ అంబానీ చిన్న కొడుకు ఆకాష్ అంబానీ నిర్వహిస్తారు.   వాట్సాప్ అనేది మెటా ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌కు (గతంలో ఫేస్​బుక్) చెందిన ఇన్​స్టంట్​ మెసేజ్​ యాప్​.  పోయిన సంవత్సరం నుండి తన వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను నడుపుతోంది. 2020 ఏప్రిల్ లో జియో ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లలో 9.99శాతం వాటాను రూ.43,574 కోట్లకు ఫేస్​బుక్ తీసుకున్నప్పటి నుండి రెండు ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ల మధ్య ఇంటిగ్రేషన్​ జరుగుతోంది.

జియోమార్ట్ తన మొదటి డెమో రోల్‌‌‌‌అవుట్‌‌‌‌ను 2020 ఏప్రిల్ లో వాట్సాప్​లో ప్రారంభించింది. మహారాష్ట్రలోని నవీ ముంబై, ఠాణే,  కళ్యాణ్ జిల్లాల్లో యాప్‌‌‌‌లో చాట్- ఆధారిత ఇంటర్‌‌‌‌ఫేస్ ద్వారా తన సేవలను అందించింది. ఈ​ యాప్​కు​ భారతదేశంలో 487 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.