చార్జీ కడితేనే జియో ఫైబర్ ‘ప్లే’
రూ.699 నుంచి రూ.8,499 మధ్యలో ప్లాన్స్
కోల్‌కతా: జియో ఫ్రీ ఫైబర్‌కు గడువు తీరిపోయింది. జియోఫైబర్ యూజర్లు ఇన్ని రోజులు పొందిన ఉచిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు బైబై చెప్పిన కంపెనీ… చార్జీల బాదుడు మొదలుపెట్టింది. ట్రిపుల్ ప్లేకు సంబంధించి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ పాత, కొత్త కస్టమర్లకు చార్జీలు విధిస్తున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. రెవెన్యూలను, లాభాలను పెంచుకోవడానికి జియో ఈ నిర్ణయం తీసుకుంది. ‘మెట్రో మార్కెట్లలో రూ.2,500 రీఫండబుల్ డిపాజిట్ కట్టిన జియో ఫైబర్ కస్టమర్లందరూ.. ఇక నుంచి చార్జీలు భరించాల్సి ఉంటుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో కమర్షియల్ బిల్లింగ్ కొన్ని వారాల్లో ప్రారంభమవుతోంది’ అని ఈ విషయం తెలిసిన ఓ అధికారి చెప్పారు. సెప్టెంబర్‌లో కమర్షియల్ లాంచ్ కావడాని కంటే ముందే ఐదు లక్షల మంది యూజర్లు జియోఫైబర్ ట్రయల్స్‌కు సైనప్ అయ్యారని ముకేశ్ అంబానీకి చెందిన టెల్కో అధికారి ఒకరన్నారు. ఈ ప్రక్రియ దశల వారీగా ఈ నెలలో ముగియనుంది. ట్రయల్స్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతున్న ప్రస్తుత కస్టమర్లకు ఉచిత హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ముగుస్తున్నాయి. వీరు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కొనసాగించాలనుకుంటే, జియో ఫైబర్ ప్లాన్స్‌లోకి మారాల్సి ఉంటుందని మరో అధికారి పేర్కొన్నారు. జియోఫైబర్ టారిఫ్ ప్లాన్స్ నెలకు రూ.699 నుంచి రూ.8,499 మధ్యలో ఉన్నాయి. 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ మధ్యలో స్పీడ్‌ను అందిస్తోంది. గేమింగ్, హోమ్ నెట్‌వర్క్ షేరింగ్, టీవీ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్ సెక్యురిటీ వంటి సర్వీసులను ఈ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీకున్న మార్కెట్ ఎగ్జిక్యూషన్, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ ఫుట్‌ప్రింట్‌తో జియో బ్రాడ్‌బ్యాండ్ యూజర్ బేస్ రెండేళ్లలో కోటికి చేరుకోనుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ ఫిచ్ డైరెక్టర్నితిన్ సోని చెప్పారు. ప్రస్తుతం జియోకు 7 లక్షల మంది యూజర్లుంటారని అంచనా.
