జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!

జియో బడ్జెట్ ఫోన్ వచ్చేసింది..రీఛార్జీ ధరలు పెంచిందని తిట్టిపోస్తున్న జనానికి.. ఓ చిన్న శుభవార్త చెప్పింది. జియో భారత్ జే1 4G ఫోన్ లాంఛ్ చేసింది. మరి ఆ ఫోన్ ధర ఎంత.. ఎంత రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని రోజుల వ్యాలిడిటీ.. ఎంత డేటా ఇస్తు్న్నారో తెలుసుకుందామా...

జియో భారత్ సిరీస్ కొత్త ఫోన్ జియో భారత్ J14G ని విడుదల చేసింది జియో కంపెనీ. గతేడాది జియో భారత్ సిరీస్ లో భాగంగా జియో భారత్ V2, జియో భారత్ V2 కార్బన్, జియో భారత్ B1 ఫోన్లను మార్కెట్లోకి విడుదలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 4Gఫోన్ తో  మరిన్ని ఆఫర్లను అందిస్తుంది జియో. తక్కువ రీచార్జ్ ఖర్చు, ఎక్కువ డేటా తో ప్లాన్ ను అందిస్తోంది. 

జియో భారత్ J1 4G  ఫోన్ ధర, లభ్యత : జియో కొత్తగా రిలీజ్ చేసిన జియో భారత్ J1 4G  ధర కేవలం రూ.1,799 మాత్రమే.. ఈ ఫోన్ బ్లాక్, గ్రే కలర్స్ లో లభిస్తుంది. ఇది అమెజాన్ లో అందు బాటు లో ఉంది. 

జియో భారత్ J1 4G  ఫోన్ ఫీచర్లు : జియో భారత్ J1 4G  ఫోన్ .. 4G నెట్ వర్క్ బేస్డ్ కీప్యాడ్ ఫీచర్ కలిగి ఉంటుంది. దీంతో పాటు గత జియో భారత్ సిరీస్ లోని ఫోన్ల డిజైన్లకు భిన్నంగా కొత్త డిజైన్ తో వస్తుంది. ఇది జియో పే వంటి యూపీఐ లావాదేవీలకు చేసే యాప్ వంటి జియో యాప్ సర్వీస్ లకు సపోర్ట్ చేస్తుంది.  జియో సినిమా ఇన్ స్టాల్ చేయడం ద్వారా కస్టమర్లు OTT స్ట్రీమింగ్ ను కూడా ఎంజాయ్ చేయొచ్చు. 

ALSO READ | Jio: మీది జియోనా..? రీఛార్జ్ డేట్ దగ్గర పడిందా..? ఇంట్లో పెళ్లి తర్వాత అంబానీ ఇచ్చిన గిఫ్ట్ ఇదే..!

అయితే చాలామంది రీచార్జ్ ప్లాన్ల ధరల విషయంతో చాలా ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికోసం ఈ ఫోన్ కు బెటర్ రీచార్జ్ ఫ్లాన్లను ఆఫర్ చేస్తుంది. అత్యంత చీపర్ రీచార్జ్ ప్లాన్ అయిన రూ. 123 ప్లాన్ తో వస్తుంది. ఇది ప్రత్యేకంగా జియో భారత్ J 4G ఫోన్ కు మాత్రమే వర్తిస్తుంది. ఈ రీచార్జ్ ఫ్లాన్ ద్వారా 28 రోజుల పాటు 14 GB డేటాను ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా డైలీ యూజ్ లిమిట్ లేకుండా డేటాను యూజ్ చేయొచ్చు. 

ఫీచర్లు: 

జియో భారత్ J1 4G ఫోన్..2.8 అంగుళాల డిస్ ప్లే, 2500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది Jio Cinema ఇన్ స్టాలేషన్ తో వస్తుంది. అలాగే Jio TV కి సపోర్టు చేస్తుంది. అంతేకాదు మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు Jio Pay యాప్ కు సపోర్ట్ చేస్తుంది.