జడ్జిలకు రక్షణ లేదు.. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే

జడ్జిలకు రక్షణ లేదు.. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే

జార్ఖండ్ జిల్లా న్యాయమూర్తి హత్య కేసును సుమోటో గా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ వాదనలు విన్నది. ఈ సందర్భంగా  వ్యాఖ్యలు చేశారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. సీబీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినప్పుడు సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. బెదిరింపులు వస్తున్నాయని చెప్పినా.. విచారణ సంస్థలు స్పందించడం లేదని ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ తన వ్యవహారాన్ని మార్చుకోవడం లేదని కామెంట్ చేసింది. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ తెలిపింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని..గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా సిద్దంగా ఉందని తెలిపింది. ఇక.. తమకు అనుకూలంగా తీర్పు రాలేదని న్యాయమూర్తులను టార్గెట్ చేయడంపైనా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది.