జార్ఖండ్ లో ఉత్కంఠ.. చంపై ప్రభుత్వం బలపరీక్ష నెగ్గేనా.?

జార్ఖండ్ లో ఉత్కంఠ.. చంపై ప్రభుత్వం బలపరీక్ష నెగ్గేనా.?

ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అవుతోంది. 2 రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో చంపై సర్కార్ బలనిరూపణ చేసుకోనుంది. హైదరాబాద్ రిసార్ట్స్ నుంచి JMM  ఎమ్మెల్యేలు రాంచీ వెళ్లారు. అయితే MLA లు చేయిజారకుండా  JMM తో పాటు కూటమి నేతలు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ్టి బల నిరూపణలో పాల్గొనేందుకు హేమంత్ సోరెన్ కు కోర్టు అనుమతిచ్చింది.

81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ లో తమకు 47 మంది ఎమ్మెల్యేల బలం ఉందని... CM చంపై గవర్నర్ కు తెలిపారు. ప్రభుత్వం నిలబడాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.. ప్రస్తుతం క్యాంప్ లో చంపై సహా.. 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారా..వ్యతిరేకంగా ఓటేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల JMM ఎమ్మెల్యే హెంబ్రోం..సోరెన్ పై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. JMM తో అనుబంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించారు. ఇటు మరో  MLA చమ్రా లిండా కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బలనిరూపణకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. 

 మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడం.. ఆయన రాజీనామా చేయడంతో చంపై సోరేన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.