ఏసు బోధనలు అనుసరణీయం

  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని 350 చర్చిలకు సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి, ప్రేమకు ప్రతీక క్రిస్మస్​ పండుగ అన్నారు. పటాన్​చెరు పరిధిలో అన్ని ప్రాంతాల్లో చర్చిల నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 

పటాన్​చెరు డివిజన్​ అంబేద్కర్ కాలనీకి చెందిన ఏ ఆధారం లేని మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని పోచారంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ తల్లి జాతరకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. దేవాలయాల నిర్మాణాలకు ఎళ్లప్పుడూ సహకారం అందిస్తానని చెప్పారు. కార్యక్రమాల్లో జగన్, భిక్షపతి, దశరథరెడ్డి. విజయ్​, నర్సింహారెడ్డి, శ్యామ్​ రావు, అతీక్​ పాల్గొన్నారు.