JEE అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల 

లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాలు జూన్ 9వ తేదీ (ఆదివారం) విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు తుది ఆన్సర్ కీతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. JEE అడ్వాన్స్ డ్ ఫలితాలను డైన్ లోడ్ చేసుకోవడానికి వెబ్ సైట్ www.jeeadb.ac.in లో అందుబాటులో ఉన్నాయి.  7 డిజిట్ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10 డిజిట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. 

ఐఐటీ మద్రాస్‌.. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్ల జాబితా, జోన్ల వారీగా టాపర్ల జాబితా, వారు సాధించిన మార్కులు, వివిధ కేటగిరీలకు కటాఫ్ మార్కులు, పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకు గాను 355తో టాపర్ గా నిలిచాడు. మరో అభ్యర్థి ఐఐటీ బాంబే జోన్ కుచెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ ఉమెన్ టాపర్ గా నిలిచింది. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను కూడా ప్రకటించారు.దీంతో పాటు JEE అడ్వాన్స్‌డ్ ఫైనల్ ఆన్సర్ కీలను కూడా వెల్లడించారు. 

JEE మెయిన్ పరీక్షలో టాప్ 2.5 లక్షలలో ర్యాంక్ సాధించిన వారు మాత్రమే JEE అడ్వాన్స్‌డ్ 2024కి అర్హులు. ఈ పరీక్షలో మూడు గంటలపాటు జరిగిన రెండు పేపర్లు ఉన్నాయి.

అర్హులైన ఆర్కిటెక్ట్‌ల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2024 రిజిస్ట్రేషన్ జూన్ 9న తెరవబడుతుంది.జూన్ 10న ముగుస్తుంది. AAT 2024 జూన్ 12న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షెడ్యూల్ చేయబడింది.  ఫలితాలు జూన్ 14న వచ్చే అవకాశం ఉంది.