బీహార్ 9వ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం

బీహార్ 9వ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న బీహార్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఇండియా కూటమితో తెగదెంపులు చేసుకున్న జేడి(యూ) అధినేత నితీష్ కుమార్ బీజేపీ జతకట్టారు. ఎన్డీయే, జెడీయూ అలయన్స్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ తొమ్మిదో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ తోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణం చేశారు. మంత్రులుగా బీజేపీ నుంచి ముగ్గురు, జేడీయూ నుంచి ముగ్గురు, హిందుస్తాన్ అవామ్ మోర్చా నుంచి ఇద్దరు.. వీరితోపాటు ఒక ఇండిపెండెంగ్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం చేశారు. 

ఇండియా కూటమితో దోస్తీ వదులుకున్న నితీష్ కుమార్.. బీజేపీ పొత్తు జతకట్టారు. జనవరి 28న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ కు రాజీనామా సమర్పించారు. ఇవాళ సాయంత్రం నాటికి బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహఘటబంధన్ లో 18 నెలల క్రితం చేరిన నితీష్ కుమార్.. ఇటీవల బీహార్ లో ఏర్పడిన రాజకీయ పరిణామాలతో మహాఘటబంధన్ నుంచి వైదొలిగారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమికి ఇది పెద్ద దెబ్బే.