అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని ప్రిన్సిపాల్‌ను కొట్టాడు ఓ ఎమ్మెల్యే. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను జూన్ 20న సందర్శించారు జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్. అక్కడ కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రిన్సిపాల్ నాగనాద్ ను ఆరా తీశారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు, ప్రిన్సిపాల్ చెప్పిన సమాధానాలకు ఎక్కడ కూడా పొంతన లేకపోవడంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే కళాశాల సిబ్బంది ముందే ప్రిన్సిపాల్ చెంప పైన కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో ఉద్యోగుల సంఘాలు జేడీఎస్ ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కమీషనర్ దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగుల సంఘం మండ్యా జిల్లా అధ్యక్షుడు శంభుగౌడ్ మంగళవారం తెలిపారు.
https://twitter.com/SheetalPronamo/status/1539258275929427969
