హీరోయిన్ మాధవి లతపై జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి హీరోయిన్ మాధవి లతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట్ అంటూ జేసి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా జేసి ప్రభాకర్ రెడ్డి మహిళలకు మాత్రమే ఎంట్రీ అంటూ నిర్వహించిన పార్టీ ఈ వివాదానికి దారి తీసింది. స్వతహాగా సనాతన ధర్మాన్ని పాటించే మాధవీ లత ఈ పార్టీని వ్యతిరేకించింది.. మహిళలు ఈ పార్టీకి దూరంగా ఉదనాలంటూ పిలుపునిచ్చింది. అంతే కాకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జేసికి చెందిన బస్సును కాల్చేయడంతో ఆయన సహనం కోల్పోయి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఆ హీరోయిన్ ఒక ప్రాస్టిట్యూట్ అంటూ మాధవీ లతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసి ప్రభాకర్ రెడ్డి. కొంచం మంచి అమ్మాయిలను పెట్టుకోండి అంటూ పార్టీకి సూచనలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కంటే జగన్ మేలు అని.. జగన్ తన బస్సులను ఆపేశాడని..బీజేపీ వాళ్ళు ఏకంగా బస్సును కాల్చేశారని మండిపడ్డారు జేసి. ఇదిలా ఉండగా.. తాడిపత్రి మహిళా కౌన్సిలర్లు మాధవీలత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. జేసి చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం కౌన్సిలర్లు ఏమి మాట్లాడకపోవడం ఇక్కడ షాకింగ్ విషయమని చెప్పాలి.

జేసి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జేసి వయసుకు తగ్గట్లు మాట్లాడితే మంచిది అంటూ హెచ్చరించారు మంత్రి సత్యకుమార్.మరి జేసి వ్యాఖ్యలకు మాధవీ లత నుండి ఎలాంటి కౌంటర్ వస్తుందో వేచి చూడాలి.