జ‌య‌ల‌లిత వేద నిల‌యంపై మ‌ద్రాసు హైకోర్టు కీల‌క తీర్పు

జ‌య‌ల‌లిత వేద నిల‌యంపై మ‌ద్రాసు హైకోర్టు కీల‌క తీర్పు

త‌మిళ‌నాడు మ‌ద్రాసు హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నివాసం వేద నిల‌యాన్ని మెమోరియ‌ల్ గా మార్చ‌డానికి వీలులేద‌ని కోర్టు తెలిపింది. ఈ మేర‌కు ADMK ఇచ్చిన జీవోను కోర్టు ర‌ద్దు చేసింది. ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవ‌డానికి హ‌క్కులేద‌ని తెలిపింది కోర్టు. మూడు వారాల్లో  పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం వేద నిలయాన్ని.. మేన‌కోడ‌లు దీప, మేనల్లుడు దీపక్ కు అప్ప‌జెప్పాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జయకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కీల‌కంగా మారింది.