‘అమ్మ’ ఆత్మ వాళ్ల అంతు చూస్తుంది

‘అమ్మ’ ఆత్మ వాళ్ల అంతు చూస్తుంది

చెన్నై: జయలలిత ఆత్మ కరుణానిధితోపాటు డీఎంకే చీఫ్ స్టాలిన్‌‌ను తప్పక శిక్షిస్తుందని తమిళనాడు సీఎం ఈ.పళనిస్వామి అన్నారు. జయ మృతికి కరుణ, స్టాలిన్‌లే కారణమని పళని ఆరోపించారు. డీఎంకే పెట్టిన కేసులు జయను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయన్నారు. ‘అమ్మ (జయలలిత) మరణానికి డీఎంకేనే కారణం. కరుణానిధి, స్టాలిన్‌‌ను దేవుడు శిక్షిస్తాడు. ప్రజలందరికీ తెలుసు అమ్మ చావుకు ఎవరు కారణమో. వారు కావాలనే ఇలా చేశారు. అమ్మ ఆత్మ వారి అంతుచూసే దాకా వదలదు. తనపై నమోదైన అభియోగాల విషయంలో కోర్టు అమ్మను నిర్దోషిగా ప్రకటించినా డీఎంకే పైకోర్టుకు వెళ్లింది. దీని వల్ల అమ్మ చాలా ఒత్తిడికి, నిరాశకు గురయ్యారు. అందువల్ల చికిత్సకు సరిగ్గా స్పందించలేకపోయారు. ఆమె ఇప్పుడు మన మధ్య లేరు’ అని పళనిస్వామి చెప్పారు.