తెలంగాణలో జటాయు సంరక్షణ కేంద్రం

కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ అటవీ డివిజన్​లోని పెంచికల్​పేట్​ రేంజ్​ పరిధిలోని నందిగాం అడవుల్లో ప్రాణహిత, పెద్దవాగు నదులు కలిసే చోట ఉన్న పాలరాపుగుట్టపై 10 ఏండ్ల క్రితం రాబందుల జాడను మొదటిసారి గుర్తించారు. అప్పట్లో 30 వరకు రాబందులు ఉండగా, ఇటీవల కాలంలో వాటి సంఖ్య తగ్గుతుండటంతో కాగజ్​నగర్​ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పాలరాపు గుట్టను జటాయు సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏకో టూరిజం డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​లో భాగంగా రూ.2.5కోట్లతో రాబందుల ఆవాసాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

జటాయు సంరక్షణ చర్యలు 

  • అటవీ సమీప గ్రామాల్లో  రైతులు, పశువుల కాపరులకు రాబందుల గురించి అవగాహన కల్పించడం.
  • పాలరాపుగుట్టల వెంట అటవీ ఉత్పత్తులు, వంట చెరకు సేకరణ నిషేధించడం.
  • పాలరాపుగుట్టల వైపుగా పశువులను మేతకు తీసుకెళ్లకుండా ప్రత్యామ్నాయంగా గ్రామ శివార్లలోనే గడ్డి క్షేత్రాలను పెంచడం. అడవిలో నిప్పు రాజుకోకుండా చర్యలు చేపట్టడం. సహజ రీతిలో రాబందులకు ఆహారం అందేలా చూడటం.