ICC Rankings: బుమ్రా @ 1

దుబాయ్‌‌‌‌: టీమిండియా స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా టెస్ట్‌‌‌‌ల్లో మళ్లీ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో బుమ్రా (870) ఒక్క ప్లేస్‌‌‌‌ మెరుగుపడి టాప్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌‌‌‌తో జరిగిన రెండో టెస్ట్‌‌‌‌లో ఆరు వికెట్లు తీయడం బుమ్రా ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది.

ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌గా నిలిచిన ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ (869) రెండో ర్యాంక్‌‌‌‌లో ఉన్నాడు. రవీంద్ర జడేజా (809), కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (672) వరుసగా 6, 16వ ర్యాంక్‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌‌‌‌ విభాగంలో యశస్వి జైస్వాల్‌‌‌‌ (792) రెండు ప్లేస్‌‌‌‌లు మెరుగుపడి మూడో ర్యాంక్‌‌‌‌లోకి దూసుకొచ్చాడు. రెండో టెస్ట్‌‌‌‌లో రెండు హాఫ్‌‌‌‌ సెంచరీలు చేయడం జైస్వాల్‌‌‌‌కు కలిసొచ్చింది. విరాట్ కోహ్లీ (724) ఆరు ర్యాంక్‌‌‌‌లు మెరుగుపడి ఆరో ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (718), రోహిత్‌‌‌‌ శర్మ (693), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (684) వరుసగా 9, 15, 16వ ర్యాంక్‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు. జో రూట్‌‌‌‌ (899),  కేన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ (829) టాప్‌‌‌‌–2లో ఉన్నారు. ఆల్‌‌‌‌రౌండర్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో జడేజా (468), అశ్విన్‌‌‌‌ (358) తొలి రెండు ర్యాంక్​ల్లో  ఉన్నారు.