ICC Test Rankings: నెం.1 బౌలర్‌గా బుమ్రా.. టాప్ ర్యాంక్‌కు చేరువలో జైశ్వాల్‌

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు దూకుడు చూపిస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించిన తర్వాత మన ఆటగాళ్ల ర్యాంక్ లు మెరుగు పడ్డాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన బుమ్రా (883) టెస్ట్ ర్యాంకింగ్స్ లో తిరిగి టాప్ ర్యాంక్ కు చేరుకున్నాడు. బుమ్రా దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా (872)ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. 

మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండో ర్యాంక్ కు చేరుకున్నాడు. పెర్త్ టెస్టులో జైశ్వాల్ తొలి ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమైనా.. రెండో ఇన్నింగ్స్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 161 పరుగులు చేసి రెండు స్థానాలు  మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో అతను విలియంసన్, బ్రూక్ లను వెనక్కి నెట్టాడు. తొలి స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్  కొనసాగుతున్నాడు.

ALSO READ | IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి 

జైశ్వాల్ టాప్ కు చెరువువడం కష్టంగానే కనిపిస్తుంది. రూట్ ఖాతాలో 903 రేటింగ్ పాయింట్స్ ఉంటే.. 825 పాయింట్స్ తో జైశ్వాల్ 825 పాయింట్స్ తో చాలా దూరంలో ఉన్నాడు. మిగిలిన నాలుగు టెస్టుల్లో జైశ్వాల్ అత్యుత్తమంగా ఆడితే తొలి స్థానానికి చేరుకోవచ్చు. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో కెరీర్ లో 81 వ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ 9 స్థానాలు ఎగబాకి 13 వ స్థానానికి చేరుకున్నాడు. టీమ్స్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి ర్యాంక్ లో.. భారత్ రెండో ర్యాంక్ లో ఉన్నాయి.