IND vs BAN 2024: టీమిండియాలోకి బుమ్రా.. భారత్‌ను భయపెట్టిన బంగ్లా

బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులో చేరాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా ఆడుతున్న తొలి సిరీస్ కావడం విశేషం. వర్క్ లోడ్ మ్యానేజ్ మెంట్ కింద బుమ్రాకు రెస్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో అతను జింబాబ్వేతో టీ20 సిరీస్ తో పాటు.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. వాస్తవానికి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు సైతం బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భావించారు. కానీ కట్ చేస్తే బంగ్లా  టెస్ట్ సిరీస్ కు బుమ్రాను ఎంపిక చేశారు. 

బంగ్లాదేశ్ జట్టును చిన్న జట్టుగా తీసుకుంటే ప్రమాదమే. ఎందుకంటే ఆ జట్టు ఇప్పుడు అగ్ర శ్రేణి జట్లకు షాకిస్తుంది. షకీబ్, రహీం, మోమినుల్ లిటన్ దాస్, శాంటో లాంటి అనుభవమైన ప్లేయర్లు ఆ జట్టు సొంతం. తాజాగా పాకిస్థాన్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించింది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ రెస్ట్ తీసుకోకుండా వెంటనే ప్రాక్టీస్ ప్రారంభించింది. బంగ్లా కెప్టెన్ శాంటో భారత్ పై సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నమని ఇటీవలే తెలిపాడు. దీంతో బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమని భావించిన భారత్ అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును సెలక్ట్ చేసింది. 

Also Read:-కెరీర్ ముగిసిందనుకున్నారు.. ఏకంగా టీమిండియాలోనే చోటు

ఈ క్రమంలో స్టార్ పేసర్ బుమ్రాను భారత జట్టులోకి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో భారత్  68.52 శాతం విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతుంది.మరోవైపు బంగ్లాదేశ్ పాకిస్థాన్ పై క్లీన్ స్వీప్ చేసిన తర్వాత 45.83 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది.టెస్ట్ ఛాంపియన్ లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది. ఫైనల్ కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులాడాలి. వీటిలో 5 స్వదేశంలో.. మరో ఐదు ఆస్ట్రేలియాలో ఆడాల్సి ఉంది.